మలయాళ నటుడు జోజు జార్జ్ ‘పాణి’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ యాక్షన్ చిత్రానికి మంచి స్పందన లభించింది.
ఇప్పుడు, ఈ చిత్రం OTT లో విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. పాణి సినిమా జనవరి 16, 2025న సోనిలివ్‌లో ప్రీమియర్ అవుతుంది. ఈ చిత్రం మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో జోజు జార్జ్, అభినయ, సాగర్ సూర్య, జునైజ్ వీపీ, సీమ, సుజిత్ శంకర్, ప్రశాంత్ అలెగ్జాండర్, రంజిత్ వేలాయుధన్, బాబీ కురియన్, రినోష్ జార్జ్, జయశంకర్, అభయ హిరణ్మయి తదితరులు నటించారు.
జోజు జార్జ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించగా, సామ్ సిఎస్ మరియు విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు. వేణు, జింటో జార్జ్ కెమెరా హ్యాండిల్ చేయగా, ఎం. రియాజ్ ఆడమ్, సిజో వడక్కన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.