గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సంక్రాంతి పండగకి విడుదలైన ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం బాలకృష్ణ నాల్గవ బ్లాక్ బస్టర్.
ఎస్.ఎస్. థమన్ సంగీతం ఈ చిత్రం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కించారు.
డాకు మహారాజ్ డిజిటల్ హక్కుల వివరాలను నిర్మాతలు ప్రకటించారు. డాకు మహారాజ్ OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక, డాకూ మహారాజ్ 21 ఫిబ్రవరి 2025 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలవుతుంది
ఈ చిత్రంలో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ మరియు ఇతరులు నటించారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు, థమన్ ఎస్ సంగీతం అందించారు మరియు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా హ్యాండిల్ చేసారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ & సాయి సౌజన్య నిర్మించారు.