ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలకు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
కానీ దురదృష్టవశాత్తూ, మొదటి షో నుండే డిజాస్టర్ రెస్పాన్స్ రావడంతో అన్ని అంచనాలు తారుమారైపోయాయి. ఇక ఇప్పుడు, గేమ్ ఛేంజర్ OTT ప్లాట్‌ఫామ్ సమాచారాన్ని మేకర్స్ వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ OTT ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో, ఈ చిత్రం తెలుగు, తమిళం, మరియు కన్నడలో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 07, 2025 న ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
రామ్ చరణ్‌తో పాటు, ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, S.J. సూర్య, శ్రీకాంత్, సునీల్ మరియు ఇతరులు నటించారు.
శంకర్ దర్శకత్వం వహించారు, థమన్ S సంగీతం సమకూర్చారు, S తిరునావుక్కరస్ సినిమాటోగ్రఫీ అందించాడు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ మరియు ఆదిత్యరామ్ నిర్మించారు.