అజిత్ నటించిన ‘పట్టుదల’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ తెలియని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది.
‘పట్టుదల’ ఒక యాక్షన్ డ్రామా, అజిత్ సినిమాలు యాక్షన్ కి ప్రసిద్ధి చెందాయి. ‘పట్టుదల’ ఫిబ్రవరి 06, 2025 లో విడుదల అవుతుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది, ట్రైలర్ యాక్షన్ తో నిండి ఉంది. “విడాముయార్చి” సినిమాను తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.
‘పట్టుదల’ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది, ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో అజిత్ కుమార్, త్రిష, అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ తదితరులు నటించారు.
ఈ సినిమాకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.