Super Machi Review: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో స్టార్ మూవీ “సూపర్ మచ్చి”. ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కళ్యాన్ దేవ్ మ్యానరిజమ్స్, డ్యాన్స్ మెగా ఫ్యామిలీకి తగ్గట్టున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. అన్ని జానర్ల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా రివ్యుకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాన్ రామ్ ది ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ డెబ్యూ మూవీ “సూపర్ మచ్చి” ఈ మూవీ ట్రైలర్ కు వచ్చిన మంచి స్పందనే సినిమాకు కూడా వచ్చింది. రచితా రామ్ ఈ సినిమాలో కళ్యాన్ సరసన హీరోయిన్ గా నటించింది. పులి వాసు కథను అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చగా, శ్యాం కె నాయుడు కెమెరా మెన్ గా వర్క్ చేశారు.
కథ విషయానికి వస్తే.. ఒక మిడిల్ క్లాస్ సింగర్ రాజు (కళ్యాన్ దేవ్). అతన్ని గతంలో ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు రచితా రామ్ చెబుతుంది. కాని దీన్నంతటినీ హీరో కొట్టిపారేస్తాడు. హీరోయిన్ రచితా రామ్, రాజు భార్యని అన్నట్లు అఫిషియల్ గా రికార్డ్స్ లో నమోదు చేస్తుంది. ఇక కథమొత్తం ఇక్కడి నుంచే మలుపు తిరుగుతుంది. పులి వాసు ఈ సినిమాకు అద్భతంగా కథ, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు.
సినిమా ఎలా ఉందంటే
కళ్యాన్ దేవ్ తన తొలి సినిమా అయినప్పటికీ ఇరగదీశాడు. కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ సినిమా “సూపర్ మచ్చి”. శ్యాం కె నాయుడు సీనియర్ సినిమాటోగ్రాఫర్ గా పేరు నిలబెట్టుకున్నారు. వెజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ 2022 సంక్రాంతికి మరో మంచి ఫ్యామిలీ చిత్రంగా “సూపర్ మచ్చి” నిలిచి పోతుంది”.
మూవీ రేటింగ్ : 3.5/5
ఇవి కూడా చూడండి: