Suzhal Season 2 Series OTT: సుడల్ సీజన్ 2 సిరీస్ OTT లోకి రాబోతుంది

Suzhal Season 2 Series OTT

తమిళంలో అత్యంత విజయవంతమైన వెబ్ సిరీస్ సుడల్ – ది వోర్టెక్స్ ఎంతో హిట్ అయినా తరవాత ఇప్పుడు సీజన్ 2 తో తిరిగి వస్తోంది.

ప్రైమ్ వీడియో గతంలో సీజన్ 2 ను ప్రకటించింది ఇక ఇప్పుడు విడుదల తేదీని కూడా ప్రకటించారు. సుడల్ సీజన్ 2 ఫిబ్రవరి 21, 2025 న ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.

ఈ సిరీస్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌లో కతిర్, ఐశ్వర్య రాజేష్, రాధాకృష్ణన్ పార్థిబన్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, మంజిమా మోహన్, గౌరీ కిషన్, సంయుక్త విశ్వనాథన్, ఎలాంగో కుమారవేల్, నివేధితా సతీష్, గోపికా రమేష్ మరియు తదితరులు నటిస్తున్నారు.

ఈ సిరీస్ కి పుష్కర్ – గాయత్రి కథ రాశారు మరియు బ్రహ్మ జి. మరియు అనుచరణ్ మురుగయ్యన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. వాల్‌వాచర్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుంది.

సుడల్ సీజన్ 2 లోని నటీనటులు, రచన, మరియు ట్విస్ట్స్ తో సీజన్ 1 కంటే గొప్పగా ఉంటుందని అంచనా.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు