సివరపల్లి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానున్న కొత్త తెలుగు వెబ్ సిరీస్. సివరపల్లి ప్రైమ్ వీడియోలో జనవరి 24, 2025న రిలీజ్ అవుతుంది.
ఈ సిరీస్ ట్రైలర్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది, ట్రైలర్ అయితే చాలా బాగుంది. సివరపల్లి సిరీస్ కథ ఒక గ్రామంలో జరుగుతుంది. ముఖ్యంగా, ఈ సిరీస్ హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ యొక్క రీమేక్ లాగా కనిపిస్తుంది.
సివరపల్లి సిరీస్‌లో రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూపా లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె, పావని కరణం మరియు ఇతరులు నటించారు.
కథను షణ్ముఖ ప్రశాంత్ రాశారు, భాస్కర్ మౌర్య దర్శకుడు, మరియు టీవీఎఫ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అరుణాబ్ కుమార్ నిర్మించారు.