హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్ కొన్ని ఆసక్తికరమైన కాన్సెప్ట్‌లతో కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లతో వస్తోంది. ఇక ఇప్పుడు “కోబలి” అనే కొత్త సిరీస్‌ను ప్రకటించారు, ఇది మొదట త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ సినిమా కోసం ప్రకటించిన టైటిల్.
ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ఈ మద్యే రిలీజ్ అయింది మరియు ఫిబ్రవరి 04, 2025న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.
ఈ రూరల్ యాక్షన్ డ్రామా సిరీస్‌లో రవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించారు, శ్రీ తేజ్, శ్యామల మరియు మరికొందరు నూతన నటులు రాకీ సింగ్, వెంకట్, తరుణ్ రోహిత్, డాక్టర్ భరత్ రెడ్డి, యోగ్ ఖత్రి, గడ్డం నవీన్, సాగర్ మజ్జి, మణికంఠ, సుక్కు రెడ్డి ప్రముఖ పాత్రలు పోషించారు..
ఈ సిరీస్‌కు నూతన దర్శకుడు రేవంత్ లెవాక దర్శకత్వం వహించారు, ఛాయాగ్రహణం రోహిత్ బచు నిర్వహిస్తున్నారు మరియు నిర్మాతలు జ్యోతి మేఘవత్ రాథోడ్, రాజ శేఖర్ రెడ్డి కమ్మిరెడ్డి & తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.