నటుడు మోహన్ లాల్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు, ఈ సినిమాను ఆయన చాలా సంవత్సరాలుగా 3Dలో నిర్మించారు. దురదృష్టవశాత్తు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.
ఇక ఇప్పుడు, బరోజ్ OTT జనవరి 22, 2025 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో రిలీజ్ కి సిద్ధం గా ఉంది.
బరోజ్ సినిమాలో మోహన్ లాల్, గురు సోమసుందరం, తుహిన్ మీనన్, జూన్ విగ్, మాయా రావు వెస్ట్, నెరియా కామాచో, ఇగ్నాసియో మాటియోస్ మరియు ఇతరులు ప్రముఖ పాత్రల్లో నటించారు.
మోహన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించారు, ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు.