వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.
ఇప్పుడు ఈ సినిమా OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈటీవీ విన్ లో జనవరి 24, 2025న రిలీజ్ అవుతుంది.
వెన్నెల కిషోర్ తో పాటు, ఈ సినిమాలో అనన్య నాగళ్ల, సియా గౌతమ్, రవితేజ మహాదాస్యం, మురళీధర్ గౌడ్, తదితరులు నటించారు.
రచయిత మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్, జ్ఞాని స్వరకర్తలు, మల్లికార్జున్ నరగణి కెమెరా హ్యాండిల్ చేశారు. శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.