టోవినో థామస్ నటించిన మలయాళం ‘ఐడెంటిటీ’ సినిమా జనవరి 02, 2025న థియేటర్లలో విడుదలైంది, ఆ తరవాత తెలుగు వెర్షన్ జనవరి 24, 2025న విడుదలైంది.
కానీ ఆశ్చర్యకరంగా, ఈ సినిమా జనవరి 31, 2025న OTTలోకి వస్తోంది. Zee5లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, మరియు కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది.
టోవినో థామస్‌తో పాటు, ఈ సినిమాలో త్రిష, వినయ్ రాయ్, మణిద్ర బేడి, అజు వర్గీస్, తదితరులు నటించారు. అఖిల్ పాల్ & అనాస్ ఖా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అఖిల్ జార్జ్ కెమెరాను హ్యాండిల్ చేశారు, జేక్స్ బెజోయ్ సంగీతం సమకూర్చారు, చమన్ చక్కో ఈ చిత్రానికి ఎడిట్ చేశారు మరియు రాజు మల్లియత్ రాయ్ సి. జె ఈ చిత్రాన్ని నిర్మించారు.