షబానా అజ్మీ, గజరాజ్ రావ్, జ్యోతిక, నిమిషా సజయన్, షాలిని పాండే, అంజలి ఆనంద్ మరియు సాయి తమాంకర్, అందరూ ‘డబ్బా కార్టెల్’ అనే క్రేజీ వెబ్ సిరీస్ కోసం ఏకమయ్యారు.
తెలుగులో కుడా ఈ సిరీస్ రాబోతోంది, డబ్బా కార్టెల్ సిరీస్ 28 ఫిబ్రవరి 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది.
అన్ని భాషల్లో ఉన్న నటీనటులని ఈ సిరీస్ కోసం క్యాస్ట్ చేయడంతో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరియు ఇటీవల విడుదల చేసిన టీజర్, అంచనాలను మరింత పెంచింది.
జ్యోతిక, నిమిషా సజయన్, షబానా అజ్మీ, గజరాజ్ రావు, షాలిని పాండే, అంజలి ఆనంద్ మరియు సాయి తమ్‌హంకర్‌లతో పాటు, ఈ సిరీస్లో జిషు సేన్‌గుప్తా, లిల్లెట్ దూబే మరియు భూపేంద్ర సింగ్ జాదావత్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌ను విష్ణు మీనన్, గౌరవ్ కపూర్, శిబానీ అక్తర్ మరియు ఆకాంక్ష సేదా రూపొందించారు, హితేష్ భాటియా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్‌ను నిర్మించింది.