ఆహా వీడియో మలయాళం నుండి మరో డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వివేకానందన్ విరాలను షైన్ టామ్ చాకో నటించిన మలయాళ చిత్రం ఇక ఇప్పుడు ఈ చిత్రం ‘వివేకానందన్ వైరల్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
వివేకానందన్ వైరల్ 07 ఫిబ్రవరి 2025న ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. షైన్ టామ్ చాకోతో పాటు, ఈ చిత్రంలో గ్రేస్ ఆంటోనీ, మాల పార్వతి, మెరీనా మైఖేల్, స్వాసిక, జానీ ఆంటోనీ మరియు ఇతరులు నటించారు.
ఈ ప్రాజెక్టుకు కమల్ దర్శకత్వం వహించగా, ప్రకాష్ వేలాయుధన్ ఛాయాగ్రహణం, మరియు బిజిబాల్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నేదియత్ నసీబ్ మరియు పిఎస్ షెల్లిరాజ్ నిర్మించారు.