Marco Movie OTT: మలయాళ బ్లాక్ బస్టర్ “మార్కో” సినిమా OTT లోకి రాబోతుంది

Marco Movie OTT

మలయాళంలో అతిపెద్ద యాక్షన్ చిత్రం ‘మార్కో’ ఎట్టకేలకు తెలుగుతో సహా అన్ని భాషల్లో OTT లోకి రాబోతోంది. ఈ చిత్రంలో ఉన్న చాలా క్రూరమైన యాక్షన్ కారణంగా హాట్ టాపిక్‌గా మారింది.

మార్కో ఫిబ్రవరి 14, 2025న సోనిలివ్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా విడుదల అవుతుంది.

ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహాన్ సింగ్ మరియు ఇతరులు నటించారు. హనీఫ్ అదేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు.

చంద్రు సెల్వరాజ్ కెమెరాను హ్యాండిల్ చేయగా, షమీర్ ముహమ్మద్ ఈ చిత్రాన్నీ ఎడిట్ చేశారు. ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు