మన మహానటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ‘అక్క’ వెబ్ సిరీస్‌తో OTT లో అరంగేట్రం చేస్తోంది. అక్క వెబ్ సిరీస్ అతి త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
ఇటీవల, నెట్‌ఫ్లిక్స్ వారి రాబోయే కొత్త సినిమాలు, సిరీస్ ల గురించి ముంబైలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది అందులో ఒకటే ఈ అక్క వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్ ఆసక్తికరంగా కూడా ఉంది.
కీర్తి సురేష్ మునుపెన్నడూ చూడని అవతారంలో ఉంది. ఇంకా, రాధికా ఆప్టే కూడా ఈ సిరీస్‌లో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది.
మనం టీజర్ ని గమనిస్తే, అక్క పెర్నూరును పాలించిన శక్తివంతమైన మహిళల గురించి అనిపిస్తుంది. కీర్తి సురేష్ పరివర్తన, ప్రపంచం మరియు అక్క యొక్క కలర్ టోన్ అసాధారణంగా ఉన్నాయి.
అక్క వెబ్ సిరీస్‌ను ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు మరియు YRF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. అక్క సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల అవుతుందని ప్రచారం లో ఉంది.