కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ థియేటర్ లో రిలీజైనప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.
ఇక ఇప్పుడు OTT లోకి వస్తోంది, మాక్స్ 15 ఫిబ్రవరి 2025న Zee5లో ప్రసారం అవుతుంది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది.
సుదీప్, వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సునీల్, ఇళవరసు, ఉగ్రమ్ మంజు, సుధా బెలవాడి, శరత్ లోహితస్వ, అడుకలం నరేన్, సుకృత వాగ్లే తదితరులు నటించారు.
విజయ్ కార్తికేయన్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, శేఖర్ చంద్ర కెమెరా హ్యాండిల్ చేశారు. ఈ చిత్రాన్ని కలైప్పులి ఎస్.థాను, కిచ్చా సుదీప నిర్మించారు