కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల నటించిన ‘భైరతి రణగల్’ నవంబర్ 15, 2024లో థియేటర్లలో విడుదలై మంచి స్పందనను పొందింది.
భైరతి రణగల్ సినిమా కన్నడ వెర్షన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది; ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. భైరతి రణగల్ తెలుగు ఫిబ్రవరి 13, 2025న ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
శివరాజ్ కుమార్ తో పాటు, ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, రాహుల్ బోస్, దేవరాజ్, షబీర్ కల్లరక్కల్, వసిష్ట ఎన్. సింహ, చాయా సింగ్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి నర్తన్ దర్శకుడు, రవి బస్రూర్ సంగీతం అందించగా, నవీన్ కుమార్ కెమెరా హ్యాండిల్ చేశారు. గీతా పిక్చర్స్ బ్యానర్ కింద గీతా శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.