గతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన కంటెంట్‌పై దృష్టి సారిస్తోంది సోనీ లివ్ OTT ప్లాట్‌ఫామ్. అలాంటిదే ఇప్పుడు “ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్” అనే మరో ఆసక్తికరమైన సిరీస్‌తో వస్తున్నారు, ఇది ఘోరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత సంఘటన నేపథ్యంలో రూపొందించబడింది.
ఈ కొత్త సిరీస్ యొక్క టీజర్ ఈ మద్యే రిలీజ్ అయింది అలాగే మార్చి 07, 2025న సోనీ లివ్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
రామ్ మాధ్వానీ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు, దీనిని తన సొంత బ్యానర్ రామ్ మాధ్వానీ ఫిల్మ్స్‌పై నిర్మించారు మరియు అమితా మాధ్వానీ మరియు రామ్ మాధ్వానీ స్వయంగా నిర్మించారు, కావ్య శర్మ ఛాయాగ్రహణం అందించారు.
తారుక్ రైనా, నికితా దత్తా, సాహిల్ మెహతా, భావ్‌షీల్ సింగ్, అలెక్స్ రీస్, పాల్ మెక్‌ఇవాన్, కార్ల్ వార్టన్, రిచర్డ్ భక్తి క్లీన్, మీనాక్షి చుగ్ మరియు మరికొందరు నటించారు.