ఈ సంవత్సరం పొంగల్ సందర్భంగా విడుదలైన తొలి మలయాళ హిట్ చిత్రం “రేఖా చిత్రం”. సినిమా కధనం కొంచెం స్లోగా ఉన్నప్పటికీ, మంచి విజయం సాధించింది.
ఇప్పుడు ఈ సినిమా OTT ప్రీమియర్ తేదీ విడుదల చేసారు. ఈ చిత్రం మార్చి 07, 2025న సోనీ లివ్ OTT ప్లాట్‌ఫామ్‌లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదలవుతుంది.
ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ కె జయన్, జరీన్ షిహాబ్, సిద్ధిక్, భామ అరుణ్, మేఘ థామస్, జగదీష్, నిశాంత్ సాగర్, ఇంద్రన్స్, హరిశ్రీ అశోకన్, ప్రియాంక మరియు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
జోఫిన్ టి. చాకో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముజీబ్ మజీద్ సంగీతం సమకూర్చారు, అప్పు ప్రభాకర్ కెమెరాను నిర్వహించారు, మరియు షమీర్ ముహమ్మద్ ఎడిటర్‌గా వ్యవహరించారు, వేణు కున్నప్పిల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.