
అజిత్ కుమార్ నటించిన “పట్టుదల” ఫిబ్రవరి 06, 2025న థియేటర్లలో విడుదలైంది, కానీ దారుణంగా విఫలమైంది. ఇక ఇప్పుడు రెండు వారాలకే డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రం మార్చి 03, 2025న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలకి సిద్ధంగా ఉంది.
అజిత్ కుమార్‌తో పాటు, ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ మరియు మరికొందరు నటించారు.
మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు, ఓం ప్రకాష్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు మరియు NB శ్రీకాంత్ ఎడిటర్‌గా పనిచేశారు.
