
మాస్ కా దాస్ తాజా చిత్రం ‘లైలా’ థియేటర్లలో విడుదలైంది కానీ డిజాస్టర్ గా నిలిచింది. పేలవమైన కథ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
ఇప్పుడు, లైలా చిత్రం OTTలో ప్రీమియర్ కానుంది, మార్చి 07, 2025 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
విశ్వక్ సేన్‌తో పాటు ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీరాజ్ మరియు తదితరులు నటించిన ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు.
లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు మరియు సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ చిత్రాన్ని OTT లో ఎలా ఆదరిస్తారో చూడాలి.
