దర్శకుడు కె. రాఘవేంద్రరావు గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పర్యవేక్షిస్తూ కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు “లైఫ్ పార్టనర్” అనే చిత్రం ద్వారా మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.
ఈటీవీ విన్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కొత్త OTT చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఏప్రిల్ 06, 2025న OTT లో విడుదల అవుతుంది.
ఈ చిత్రంలో నటుడు శ్రీహాన్ మరియు నటి సోనియా సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు, మరికొందరు ఇతర ప్రముఖ పాత్రల్లో నటించారు.
కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణ మరియు నిర్మాణంలో నిర్మించబడిన ఈ చిత్రానికి రాంకి దర్శకుడు. వి. కిరణ్ కుమార సంగీతం సమకూర్చారు, జి. శేఖర్ సినిమాటోగ్రాఫర్, రాఘవేంద్ర వర్మ ఎడిటర్.