యూట్యూబర్ మౌళి తనూజ్ ప్రశాంత్ “90’s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్” అనే సూపర్ హిట్ సిరీస్ లో తన పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు అతను “లిటిల్ హార్ట్స్” సినిమాతో బిగ్ స్క్రీన్ పై ప్రధాన నటుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.
ETV Win 2వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. OTT స్ట్రీమింగ్ హక్కులను ETV Win ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది.
ఈ లవ్ డ్రామాలో మౌళి తనూజ్ ప్రశాంత్ కథానాయకుడిగా, శివాని నగరం కథానాయకిగా నటించారు. ఈ సినిమా లో రాజీవ్ కనకాల మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.
ఆదిత్య హసన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ రచయిత మరియు దర్శకుడు. సూర్య బాలాజీ సినిమాటోగ్రాఫర్, సింజిత్ యెర్రమిల్లి సంగీత దర్శకుడు, శ్రీధర్ సోంపల్లి ఎడిటర్.