ఇటీవల విడుదలైన నాగ చైతన్య ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో తొలి 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం OTTలో విడుదల కానుంది. తండేల్ మార్చి 07, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది అలాగే ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది.
నాగ చైతన్యతో పాటు, ఈ చిత్రంలో సాయి పల్లవి, బబ్లూ పృథివీరాజ్, దివ్య పిళ్లై మరియు ఇతరులు నటించారు.
చందూ మొండేటి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు, శామ్డా కెమెరాను హ్యాండిల్ చేయగా, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.