జబర్దస్త్ ఫేమ్ ధన్ రాజ్ ఇటీవలే “రామం రాఘవం” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, ఈ సినిమా ఫిబ్రవరి 21, 2025న విడుదలైంది. తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల నుండి చాలా పేలవమైన స్పందనను పొందింది.
సముద్రఖని వంటి ప్రతిభావంతులైన నటులు ముఖ్యమైన పాత్రలో నటించినప్పటికీ, కథ మరియు నిర్మాణం కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల నుండి గుర్తింపు పొందలేకపోయింది. ఇక ఇప్పుడు ETV Win ప్లాట్‌ఫామ్‌లో మార్చ్ 14thన OTT ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది.
సముద్రఖని, ధనరాజ్ కొరాని, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజ్, మోక్ష సేన్‌గుప్తా, ప్రమోదిని మరియు మరికొందరు ఈ చిత్రంలో నటించారు.
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వీ పోలవరపు నిర్మించిన ఈ చిత్రానికి ధన్ రాజ్ కొరాని దర్శకుడు. అరుణ్ చిలువేరు సంగీత దర్శకులు, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్, దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రాఫర్.