బ్రహ్మ ఆనందం సినిమాలో లెజెండరీ హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించారు. నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయినా వీళ్ళు ఈ సినిమాలోతాతా, మనవడు పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా OTT లో విడుదల కానుంది.
బ్రహ్మ ఆనందం మార్చి 20, 2025న ఆహా వీడియోలో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. రాజా గౌతమ్, బ్రహ్మానందంతో పాటు, ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోళక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, దివిజా ప్రభాకర్, తదితరులు నటించారు.
ఆర్‌విఎస్ నిఖిల్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శాండిల్య పిసపత్ సంగీతం సమకూర్చగా, మితేష్ పర్వతనేని ఛాయాగ్రహణం అందించారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు.