జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 2024 లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.
ఇప్పుడు ఈ చిత్రం OTT లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. జితేందర్ రెడ్డి మార్చి 20, 2025న ఈటీవీ విన్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, సుబ్బరాజు, రవి ప్రకాష్ మరియు ఇతరులు నటించారు. గతంలో ఉయ్యాల జంపాల మరియు మజ్ను చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
జ్ఞాన శేఖర్ V.S కెమెరా హ్యాండిల్ చేయగా, గోపీ సుందర్ సంగీతం అందించగా, M. రవీందర్ రెడ్డి ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.