బసిల్ జోసెఫ్ నటించిన ప్రవీంకూడు షాపు చిత్రం OTT లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఒక థ్రిల్లర్ అలాగే బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వసూళ్లు రాబట్టింది.
ప్రవీంకూడు షాపు చిత్రం ఏప్రిల్ 11, 2025న సోనిలీవ్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం తమిళం, కన్నడ మరియు హిందీలో కూడా అందుబాటులో ఉండనుంది.
బసిల్ జోసెఫ్‌తో పాటు సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, శబరీష్ వర్మ, నియాస్ అబూబెకర్, శివజిత్, చాందిని శ్రీధరన్, జోసెఫ్, జార్జ్, రామ్‌కుమార్, రాజేష్ అజీకోడన్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం చేయగా, షైజు ఖలీద్ అద్భుతమైన విజువల్స్ అందించాడు, విష్ణు విజయ్ అద్భుతమైన సంగీతం అందించాడు మరియు అన్వర్ రషీద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.