ప్రదీప్ రంగనాథన్ ఇటీవల నటించిన ‘డ్రాగన్’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
థియేటర్లలో విజయం సాధించిన తర్వాత, డ్రాగన్ మార్చి 21, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.
కెఎస్ రవి కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, విజె సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇంధుమతి మణిగందన్, తేనప్పన్ మరియు ఇతరులు నటించారు.
ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు రచన మరియు దర్శకత్వం వహించారు. నికేత్ బొమ్మి కెమెరా హ్యాండిల్ చేసారు, లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు, AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.