ధనుష్ నటించిన “ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్” తో హీరోగా హాలీవుడ్ లో మొదటి చిత్రంతో అడుగుపెట్టారు.
ఇక ఇప్పుడు, ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ యొక్క తెలుగు వెర్షన్ OTT లో ప్రసారం కానుంది. ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ మార్చి 26, 2025న ఆహా వీడియోలో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
ధనుష్ తో పాటు, ఈ చిత్రంలో బెరెనిస్ బెజో, ఎరిన్ మోరియార్టీ, బర్ఖాద్ అబ్ది, బెన్ మిల్లర్, గెరార్డ్ జుగ్నోట్, అమృత సంత్, హార్టీ సింగ్ మరియు ఇతరులు నటించారు.
రొమైన్ ప్యూర్టోలాస్ మరియు లూక్ బోస్సీ స్క్రీన్‌ప్లే అందించారు, కెన్ స్కాట్ దర్శకత్వం వహించారు. విన్సెంట్ మథియాస్ కెమెరా హ్యాండిల్ చేసారు. ఈ చిత్రాన్ని M! క్యాపిటల్ వెంచర్స్, బ్రియో ఫిల్మ్స్, లిటిల్ రెడ్ కార్ ఫిల్మ్స్ మరియు ఇంపాక్ట్ ఫిల్మ్స్ నిర్మించాయి.