నటి దియా మీర్జా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. ఇక ఇప్పుడు ఆమె ఒక కొత్త OTT సినిమా “కాఫిర్” లో ప్రధాన నటిగా మన ముందుకు వస్తోంది.
ఈ సినిమా పాకిస్తాన్ లో కొన్ని పరిస్థితులను తట్టుకున్న తర్వాత భారతదేశానికి వచ్చే ఒక తల్లి చుట్టూ తిరిగే నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా ఏప్రిల్ 04, 2025న Zee5 OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో దియా మీర్జా, మోహిత్ రైనా, దారా సంధు, నటాషా రస్తోగి, మీనల్ కపూర్, ఉమర్ షరీఫ్, అభిరాయ్ సింగ్ మరియు మరికొందరు ఉన్నారు.
సోనమ్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ఒకేసారి ప్రసారం అవుతుంది. ప్రతీక్ సింగ్ కెమెరాను హ్యాండిల్ చేయగా, రవి సింఘాల్ సంగీతం సమకూర్చారు.