ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ “కథా సుధ” అనే ఫ్రాంచైజీని ప్రారంభిస్తున్నట్లు ఈ మద్యే ప్రకటించింది, ఈ ఫ్రాంచైజీలో ప్రతి ఆదివారం వారి ప్లాట్‌ఫామ్‌లో నిడివి తక్కువగా మరియు తక్కువ పాత్రలు ఉండే సినిమా విడుదల అవుతుంది.
లెజండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ కథా సుధలో భాగంగా, ఏప్రిల్ 06, 2025న ప్రీమియర్ కానున్న “లైఫ్ పార్టనర్”ను వారు ఇప్పటికే ప్రకటించారు మరియు ఇప్పుడు మరో చిత్రం “ఉత్తరం” అదే రోజున ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల అయింది ఇక ఇందులో చాలా పరిమిత పాత్రలు ఉన్నాయి. సీనియర్ నటి తులసి మరియు పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
“శతమానం భవతి” సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ మినీ-ఫిలిం అని పిలవబడే దానికి రచయిత, నిర్మాత మరియు దర్శకుడు.