చిన్న సినిమాగా రిలీజ్ అయినా ‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది.
థియేటర్లలో భారీ విజయం సాధించిన తర్వాత, ఇక ఇప్పుడు OTT లోకి రావడానికి సిద్ధంగా ఉంది. కోర్ట్ సినిమా ఏప్రిల్ 11, 2025 న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు లోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ మరియు కన్నడ లో విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ మరియు ఇతరులు నటించారు.
ఈ సినిమా కి రామ్ జగదీష్ రచన & దర్శకత్వం వహించారు, దినేష్ పురుషోత్తమన్ కెమెరాను హ్యాండిల్ చేసారు, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు మరియు వాల్ పోస్టర్ సినిమా కింద ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని సమర్పించారు.