నటి రీతు వర్మ తాను నటించిన ప్రతి సినిమాలో కొంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. ఆమె ఇప్పుడు “దేవికా & డానీ” అనే కొత్త సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది.
ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మద్యే రిలీజ్ చేసారు అలాగే టీజర్/ట్రైలర్ త్వరలో విడుదల చేయబడుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సిరీస్ యొక్క OTT స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ పొందింది.
ఈ సిరీస్ యొక్క టీజర్ లేదా ట్రైలర్ ఇంకా విడుదల కాకపోవడంతో, OTT స్ట్రీమింగ్ తేదీ గురించిన సమాచారం ఇంకా ప్రకటించలేదు. రీతు వర్మతో పాటు, ఈ సిరీస్‌లో శివ కందుకూరి, సూర్య వశిష్ట, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్ మరియు చాగంటి సుధాకర్ కూడా నటించారు.
శ్రీకరం సినిమా ఫేమ్ బి. కిషోర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇది జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. జై క్రిష్ సంగీతం సమకూర్చారు.