టాలీవుడ్‌లో మరో స్టార్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు మేనకోడలు జాన్వి ఘట్టమనేని తన తొలి సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త తరం నటికి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.
జాన్వి ఘట్టమనేని మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ ల కుమార్తె. జాన్వి ఇప్పటివరకు చదువుపైనే దృష్టి పెట్టి, లైమ్‌లైట్‌కి దూరంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ఆమె సోషల్ మీడియా ఫోటోలు, పబ్లిక్ అప్పియరెన్స్‌లు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, జాన్వికి ఇప్పటికే పలు టాప్ ప్రొడక్షన్ హౌస్‌ల నుండి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమె యాక్టింగ్ వర్క్‌షాప్స్ అటెండ్ చేస్తూ, కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్చుకుంటున్నట్లు సమాచారం.
ఆమె ఇప్పటికే తన తల్లి మంజుల దర్శకత్వం లో వచ్చిన సందీప్ కిషన్ చిత్రం మనసుకు నచ్చింది లో బాల నటిగా తళుక్కున మెరిసింది.
అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఆమె తొలి సినిమా ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ కింద తెరకెక్కే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. కొందరు అయితే, ఆమె తొలి ప్రాజెక్ట్‌కి మహేష్ బాబు సపోర్ట్ కూడా ఉంటుందని ఊహిస్తున్నారు.
తెలుగు సినిమా రంగంలో ఘట్టమనేని కుటుంబంకి ఉన్న పేరు ప్రత్యేకం. లెజెండరీ నటుడు కృష్ణ గారు, ఆయన వారసుడిగా మహేష్ బాబు, అలాగే సుధీర్ బాబు ఇప్పటికే తమ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జాన్వి ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.
ఆమె లేటెస్ట్ ఫోటోలు, సోషల్ మీడియా ప్రెజెన్స్ చూస్తేనే ఆమెలో ఉండే కాన్ఫిడెన్స్, గ్లామర్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
జాన్వి ఎంట్రీ వార్తతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
“Another Superstar Loading”, “Ghattamaneni Princess is Ready” వంటి కామెంట్లు X (Twitter), Instagramలో ట్రెండ్ అవుతున్నాయి. మహేష్ బాబు కెరీర్ ప్రారంభం సమయంలో ఉన్న హైప్ ఇప్పుడు జాన్వి ఎంట్రీ చుట్టూ తిరుగుతోంది.
జాన్వి ఘట్టమనేని ఎంట్రీతో టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో స్టార్‌గా రాబోతున్న జాన్వి, సరైన ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటే, తదుపరి తరం లీడింగ్ లేడీగా నిలిచే అవకాశముంది.
స్క్రీన్‌పై ఆమె తొలి అడుగులు ఎలా ఉంటాయో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
