టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరియు ‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్ నిడిమొరు పెళ్లి వార్తలు ఇప్పుడు అధికారంగా నిజమయ్యాయి. డిసెంబర్ 1, 2025 న తమిళనాడులోని కోయంబత్తూర్ ఇషా సెంటర్ లో వీరి వివాహం జరిగింది.

ఈ పెళ్లి పూర్తిగా ప్రైవేట్ గా, సుమారు 30 మంది, సమంత మరియు రాజ్ కి దగ్గరి వారి ముందు మాత్రమే జరిగింది. మీడియా లేదా పెద్ద గెస్ట్ లు లేకుండా చాలా సింపుల్ గా నిర్వహించారు.
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు పెట్టి “01.12.2025” అని రాసి కన్‌ఫర్మ్ చేసింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి కార్యక్రమం భూత శుద్ధి వివాహ అనే ఆధ్యాత్మిక శైలిలో జరిగింది. ఇషా యోగ సెంటర్, లింగ భైరవి ఆలయం లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నట్టు సమాచారం.
సమంత – ఎరుపు సిల్క్ చీర, రాజ్ – వైట్ కుర్తా, బీజు జాకెట్ తో చాల సింపుల్ డెకరేషన్, ట్రెడిషనల్ రీతిలో వివాహ వేడుక జరిగింది.
ఇద్దరూ ది ఫామిలీ మాన్ 2, Citadel వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు, అప్పుడు నుంచే వారి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడి ప్రేమగా మారింది, కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రూమర్లు వచ్చినా, ఇప్పుడు అధికారంగా నిజమైంది.
సమంత & రాజ్ ఇద్దరూ తమ జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. వీరి జంట హ్యాపీ లైఫ్ గడపాలని అందరూ కోరుకుంటున్నారు.
