“పీప్లీ లైవ్” అనే సూపర్ క్రిటికల్ హిట్ సినిమాతో ప్రసిద్ధి పొందిన దర్శకురాలు అనుషా రిజ్వి చాలా కాలం తర్వాత మళ్లీ కొత్త సినిమాతో వచ్చారు. ఆమె కొత్త కుటుంబ హాస్య చిత్రం “ది గ్రేట్ షమ్సుద్దిన్ ఫ్యామిలీ” ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ JioHotstar లో రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాలో నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ తగాదాలు, ప్రేమ, అన్నీ కలిసిన ఒక మంచి కథ ఉంటుంది. ప్రతి ఇంట్లో జరిగే చిన్న-పెద్ద సమస్యలను సరదాగా చూపించే ఫ్యామిలీ కామెడీగా ఇది రూపొందింది.
డిసెంబర్ 12, 2025 నుంచి JioHotstar లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.
కథలో బానీ అహ్మద్ అనే అమ్మాయి (కృతికా కమ్రా) తన కెరీర్‌లో పెద్ద అవకాశం పొందడానికి 12 గంటల్లో పని పూర్తి చేయాలి. కానీ అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇంటికి వస్తూుండటంతో పెద్ద గందరగోళం మొదలవుతుంది. చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద కామెడీ సన్నివేశాలుగా మారతాయి.
ఈ సినిమాకు నటించిన వారు కృతికా కమ్రా, పూరబ్ కోహ్లీ, ఫరీదా జలాల్, శీబా చద్దా, జుహీ బబ్బర్, డాలీ అహ్లువాలియా, శ్రేయ ధన్వంతరి, ఇలా చాలా మంది స్టార్స్ నటించారు.
ఇంటి వాళ్లతో కలిసి చూసే పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ ఇది. నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలను సరదాగా చూపించారు. పిల్లలు నుండి పెద్దలు వరకు అందరికి నచ్చే సినిమా. OTT లో కంఫర్ట్ గా ఇంట్లో కూర్చొని చూడొచ్చు.
“ది గ్రేట్ షమ్సుద్దిన్ ఫ్యామిలీ” నవ్వులు, అనుభూతులు, కుటుంబపు బంధం అన్నీ కలిపిన అందమైన సినిమా. డిసెంబర్ 12 వచ్చిన వెంటనే మీ కుటుంబంతో కలిసి JioHotstar లో చూడండి.
