కెజిఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. యష్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘టాక్సిక్’ టీజర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ టీజర్‌తో పాటు యష్ పాత్ర పేరు ‘రాయా (Raya)’ అని కూడా రివీల్ చేశారు.

‘టాక్సిక్’ టీజర్ మొత్తం డార్క్, ఇంటెన్స్ టోన్‌లో సాగింది. యష్ కనిపించిన విధానం, అతని బాడీ లాంగ్వేజ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో స్పష్టంగా చూపించాయి. రాయా అనే పాత్ర పేరు కూడా టీజర్‌కు మరింత క్యూరియాసిటీని పెంచింది.
యష్ బర్త్‌డేను పురస్కరించుకుని టీజర్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. “రాయా ఇస్ కమింగ్”, “టాక్సిక్ వైబ్స్” అంటూ ఫ్యాన్స్ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్స్ చేస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే టీజర్ మిలియన్ల వ్యూస్‌ను దాటింది.
‘టాక్సిక్’ సినిమాను ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. యష్ గత సినిమాల కంటే భిన్నమైన షేడ్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడని టీజర్ స్పష్టంగా సూచిస్తోంది. రాయా పాత్ర గ్రే షేడ్స్‌తో, పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా ఉండనుందని టాక్.
యష్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘టాక్సిక్’ టీజర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా యష్ పాత్ర పేరు రాయా అని రివీల్ చేయడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది. ఇక పూర్తి సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 19 న విడుదలకి సిద్ధంగా ఉంది.
