
జి.వి. ప్రకాష్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం “లక్కీ ది సూపర్‌స్టార్” థియేటర్లో విడుదలవకుండా నేరుగా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది.
ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 20న జియోహాట్‌స్టార్‌లో ప్రీమియర్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది.
జి.వి. ప్రకాష్ కుమార్‌తో పాటు అనస్వర రాజన్, కోవై సరళ, మొట్ట రాజేంద్రన్, శరత్‌కుమార్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఉదయబాను మహేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హేశామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, పుష్పా కందసామి నిర్మించారు.
