
జీవ నటించిన “తలైవర్ తంబి తలైమైయిల్” సంక్రాంతికి విడుదలయి మంచి విజయం సాధించింది.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఫిబ్రవరి 12, 2026 నెట్‌ఫ్లిక్స్లో విడుదలవుతుంది.
జీవా, తంబి రమయ్య, ఇలవరసు, ప్రథనా నాథన్, జెన్సన్ ధివాకర్, జైవంత్, సర్జిన్ కుమార్, రాజేష్ పాండియన్, సుబాష్ కన్నన్, అమిత్ మోహన్, అనురాజ్ ఓబీ, శరత్, సావిత్రి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించగా, విశ్ణు విజయ్ సంగీతాన్ని అందించారు, బాబ్లు అజు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ చిత్రాన్ని కన్నన్ రవి నిర్మించారు.
