
మాస్ మహారాజా రవితేజ, చాలా కాలం తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫిబ్రవరి 20 2026లో Zee5లో ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, సుధాకర్, మురళీధర్ తదితరులు నటించారు.
ఈ ప్రాజెక్ట్‌కు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహించగా, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
