మహేష్ బాబు తదుపరి చిత్రం పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్

మహేష్ బాబు తదుపరి చిత్రం పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

ఈ చిత్రం విడుదలకి ఇంకా సంవత్సరం పైనే సమయం ఉంది, కానీ అప్పుడు మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రం పై చర్చ సోషల్ మీడియా లో గట్టిగ చక్కర్లు కొడుతుంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం, మహేష్ బాబు సందీప్ రెడ్డు వంగతో చేయబోతున్నారు అని గట్టిగా చక్కర్లు కొడుతుంది.

అయితే ఈ కాంబినేషన్ కోసం, హోంబేలె ఫిలిమ్స్ మరియు ఆసియన్ సినిమాస్ ప్రొడక్షన్ కంపనీలు పోటీ పడుతున్నట్లు సమాచారం.

మహేష్ బాబు కోసం, సందీప్ రెడ్డి వంగ డెవిల్ అనే చిత్రం చేయాలనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల కుదర్లేదు.

అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ, ఈ కంబినేషన్ సెట్ అయితే మాత్రం, ఫాన్స్ కి, సినిమా అభిమానులకి పండగే.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు