
తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హారర్ చిత్రం ‘ఈషా’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇప్పుడు ఈ చిత్రం OTTలో విడుదలకు సిద్ధమైంది. ‘ఈషా’ ఫిబ్రవరి 20, 2026న ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శ్రీనివాస్ మన్నే వహించగా, సంగీతాన్ని ఆర్‌ఆర్ ధ్రువన్ సమకూర్చారు. సినిమాటోగ్రఫీని సంతోష్ సనమోని నిర్వహించగా, హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
