
ZEE5 సరికొత్త తెలుగు వెబ్ సిరీస్‌గా ‘D/O ప్రసాద్ రావు కనిపడుటలేదు’ అనే సిరీస్‌ని తీసుకువస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
D/O ప్రసాద్ రావు కనిపడుటలేదు సిరీస్ 2026 ఫిబ్రవరి 27న ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, వసంతిక, ఉదయ్ భాను, గాయత్రీ భార్గవి,హిమ బిందు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సిరీస్‌కు కృష్ణ పొలురు స్క్రీన్ప్లేతో పాటు దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని రామ్ కె. మహేష్ నిర్వహించగా, సంగీతాన్ని శ్రీరామ్ మద్దూరి అందించారు. కె.వి. శ్రీ రామ్ సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించారు.
