
శివ కందుకూరి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఏ సినిమా కూడా సరైన విజయం ఇవ్వలేదు.
ఆయన తాజా చిత్రం ‘నవాబ్ కేఫ్’ ఇటీవల థియేటర్లలో విడుదలై ఘోర పరాజయంగా నిలిచింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం డిజిటల్ వేదికలోకి రానుంది.
‘నవాబ్ కేఫ్’ చిత్రం మార్చి 12, 2026 నుండి ETV Win లో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో శివ కందుకూరి,రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించగా, సంగీతాన్నిప్రశాంత్ ఆర్. విహారి సమకూర్చారు. ఛాయాగ్రహణాన్నిక్రాంతి వర్ల నిర్వహించగా, రాధా వి. పపుడిప్పు, హర్షిక ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
