
అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ఏడాది క్రితం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది. అయితే, చాల కాలం తర్వాత ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి వేదికలోకి అడుగుపెడుతోంది.
అనగనగా ఆస్ట్రేలియా మార్చి 06, 2026 నుంచి Aha Videoలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో జ్యోతినాథ్ గౌడ్, జెడిఆర్ చెరుకూరి, రిషి, చంద్రశేఖర్ కొమ్మలపాటి, సాన్య భట్నాగర్, ప్రభా అగ్రజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను తారక రామ దర్శకత్వం వహించగా, సంగీతాన్ని యూ.వి. నిరంజన్ అందించారు. సినిమాటోగ్రఫీని అరుణ్ దొండపాటి నిర్వహించగా, సహానా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బి.టి.ఆర్. శ్రీనివాసరావు నిర్మించారు.
