
మలయాళం కామెడీ డ్రామా పెన్నుమ్ పోరాట్టుమ్ థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
పెన్నుమ్ పోరాట్టుమ్ మార్చి 13, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో రాజేష్ మాధవన్, వర్ష వల్స్నా, దినేష్ పే పో, రైనా రాధాకృష్ణన్, సతీష్ పులిక్కా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం రాజేష్ మాధవన్ వహించారు. సంగీతాన్ని డాన్ విన్సెంట్ అందించగా, సినిమాటోగ్రఫీని సబిన్ ఉరాలికండి నిర్వహించారు. సంతోష్ టి. కురువిల్లా, బిను జార్జ్ అలెగ్జాండర్, షెరిన్ రాచెల్ సంతోష్ ఈ సినిమాను నిర్మించారు.
