విజయ్ సేతుపతి ‘కాట్టాన్’ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ సేతుపతి ‘కాట్టాన్’ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ కాట్టాన్ త్వరలో ఓటీటీకి రాబోతోంది. ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. టీజర్ చూస్తే కథ ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తోంది.

కాట్టాన్ వెబ్ సిరీస్ 27 మార్చి 2026 నుండి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో విజయ్ సేతుపతి, వడివేల్ మురుగన్, మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, రిషా జేకబ్స్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌కు ఎం. మణికంధన్ దర్శకత్వం వహించగా, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించారు. విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు