
తెలుగు బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ నటించిన ‘సుమతి శతకం’ సినిమా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సుమతి శతకం మార్చి 19, 2026న ETV Winలో స్ట్రీమింగ్‌కు రానుంది.
ఈ సినిమాలో అమర్‌దీప్ చౌదరి, సాయిలిమ్ చౌధరి, టేస్టీ తేజ, మహేష్ విట్టా, జేడీవీ ప్రసాద్, మిర్చి కిరణ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి దర్శకత్వం ఎం.ఎం. నాయుడు వహించగా, సంగీతం సుభాష్ ఆనంద్ అందించారు. సినిమాటోగ్రఫీని ఎస్. హలేశ్ నిర్వహించగా, సాయి సుధాకర్ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
