
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన సీతా పయనం సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సీతా పయనం మార్చి 19, 2026 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్, అర్జున్, ధృవ సర్జా, ప్రకాష్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, బిత్తిరి సత్తి, సరణ్ సిరి హనుమంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం అర్జున్ వహించగా, సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించారు. సినిమాటోగ్రఫీని జి. బాలమురుగన్ నిర్వహించారు.
